భారత్,శ్రీలంక (Ind vs Sl T20)జట్ల మధ్య జరుగుతున్న మొదటి టీ 20 మ్యాచ్ లో టీమిండియా(India ) అదరగొట్టింది.శ్రీలంక(Sree lanka ) బౌలర్స్ కి చుక్కలు చూపించారు భారత బ్యాటర్లు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్స్ కి 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 199 పరుగులు చేసింది.కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit sharma )44 పరుగులు చేసాడు.32 బంతుల్లో 2 పోర్లు ఒక సిక్స్ తో 44 పరుగులు చేసి లహిరు కుమార బౌలింగ్ లో ఔట్ అయ్యాడు.

ఇక మరో ఓపెనర్ ఇషాన్ కిషన్(Ishan kishan ) దంచి కొట్టాడు .పోర్లు ,సిక్సులతో రెచ్చిపోయాడు.56 బంతుల్లో 10 పోర్లు,3 సిక్సులతో 89 పరుగులు చేసి సూపర్ అర్థ సెంచురి సాదించాడు.మరో యువ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్(Sreyas iyyer ) కూడా అర్థ సెంచురితో ఆకట్టుకున్నాడు. ఇక శ్రీలంకకు 200 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది రోహిత్ సేన(Rohit ).