తెలుగు బిగ్ బాస్ ఓటీటీ(Bigg Boss OTT ) వెర్షన్ లో మొదటి నామినేషన్ ప్రక్రియ కంప్లీట్ అయింది. మొత్తం 17 మంది సభ్యులు ఉండగా వారిలో పాతవారిని వారియర్స్ గా కొత్తవారిని చాలెంజర్స్ గా ప్రకటించాడు బిగ్ బాస్. ఈ నేపథ్యంలో మొదటివారం చాలెంజర్స్ నామినేషన్ నుండి తప్పించుకున్నారు. బిగ్బాస్ ఆదేశం మేరకు ఈ వారం గత సీజన్లో వచ్చిన వారియర్స్ మాత్రమే నామినేషన్ లో ఉంటారు. ఈ క్రమంలో సీజన్ ఫైవ్ లో వచ్చి త్వరగా వెళ్లి పోయినా సరయు(Sarayu) మళ్లీ నామినేట్ అయింది. నామినేషన్ చేసేవాళ్లకి కొన్ని టాగ్స్ ఇచ్చి ఎవరు అయితే నామినేట్ చేస్తారో వాళ్ళు తగిన కారణాలు చెప్పి నామినేట్ చేయాలని బిగ్బాస్ ఆదేశించాడు.

ఈ క్రమంలో యాంకర్ శివ(Anchor Siva ),సరయుకి(Sarayu ) అగ్రెసివ్ ట్యాగ్ పిచ్చి నామినేట్ చేశాడు, అతనితో పాటు అనిల్ రాథోడ్(Anil Rathod ) కూడా సరయుని నామినేట్ చేసాడు.అతనితో మాట్లాడాలంటే కంఫర్ట్ గా లేదని ,ఆలోచించుకుని మరీ మాట్లాడాల్స వస్తోందని అందుకేనా ఆమెను నామినేట్ చేస్తున్నాని తెలిపారు. బిగ్బాస్ సీజన్ ఫైవ్ లో మొదటి వారమే ఎలిమినేట్ అయిన సరియు(Sarayu ) బిగ్ బాస్ ఓటిటి లో కూడా మొదటి వారం ఎలిమినేట్ అవుతుందా లేదా సేవ్ అయ్యి బిగ్బాస్ ఓటిటీలో(Bigg Boss OTT ) కొనసాగుతోందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.