Ramarao on duty in OTT: ఓటీటీలో ‘రామారావు ఆన్ డ్యూటీ’.. చిత్రబృందం సంచలన నిర్ణయం..

మాస్‌ మహారాజ రవితేజ(RaviTeja)- శరత్‌ మండవ(Sharath Mandava) కాంబోలో రూపొందుతున్న సినిమా రామారావు ఆన్ డ్యూటీ(Ramarao on duty)
. ఈ సినిమాలో దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తుండగా వేణు తొట్టెంపూడి ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఎల్ ఎల్ పి(LLP) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రం మార్చి 25న విడుదల కావాల్సి ఉంది.

కానీ అదే రోజు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్'(RRR)రిలీజ్ కానుండటంతో ఈ సినిమాను వాయిదా వేశారు నిర్మతలు. కానీ ఆ తర్వాత జూన్ వరకు వరుస సినిమాలు రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకున్నాయి. ఈ క్రమంలో రామారావు ఆన్ డ్యూటీ సినిమా ఎక్కువ రోజులు విడుదల కాకుండా ఉంచితే నష్టాలు ఖాయమని చిత్రబృందం భావిస్తోంది. అందుకే ఈ చిత్రాన్ని ఓటీటీ వేదికగా రిలీజ్ చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ఒక పోస్టర్ లో స్ట్రీమింగ్ పార్టనర్ సోనీ లీవ్(SONY LIV) అంటూ ఉంది. దీని ద్వారా ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.