Sarkaru Vaari Paata:
సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు మహాశివరాత్రి కానుక.. మాస్ అండ్ స్టైలిష్ గా మహేశ్‌

సూపర్ స్టార్ మహేశ్‌బాబు (Mahesh Babu), మహానటి కీర్తి సురేశ్‌(Keerthi Suresh) జోడీగా పరశురామ్‌(Parashuram) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సర్కారువారి పాట’. సముద్రఖని విలన్ రోల్ చేస్తున్నాడు. జిఎంబి ప్రొడక్షన్స్, మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా మే 12వ తేదీన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata)
మూవీ నుంచి మహా శివరాత్రి(Maha Shivarathri) సందర్భంగా ఈ సినిమా ఫెస్టివల్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆయ‌న్ని ఎలా అయితే చూడాల‌నుకుంటారో అలానే ఈ సినిమా ఉంటుందని ఇందులో మహేష్ బాబు లుక్ చూస్తేనే అర్థ‌మ‌వుతుంది. చాలా రోజుల త‌ర్వాత ప‌క్కా మాస్ లుక్‌లో మహేష్ బాబు క‌నిపించ‌బోతున్నారు. కాగా, నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌, రామ్‌ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహేశ్‌ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నాడని టాక్ నడుస్తోంది. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్న ఈ మూవీ భారత బ్యాంకింగ్ రంగంలోని కుంభకోణాల చుట్టూ సాగుతోందని సమాచారం.