Prabhas radhe shyam movie promotions: ‘రాధే శ్యామ్’ డిఫెరెంట్ ప్రమోషన్స్ షురూ.. ఇది చూసేయండి!

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Radhe Shyam), పూజా హెగ్డే(Pooja Hegde)జంటగా నటించిన పాన్‌ ఇండియా మూవీ రాధే శ్యామ్‌. కేకే రాధాకృష్ణ కుమార్‌(K.K. Radhakrishna Kumar) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్‌ జోతిష్య నిపుణిడిగా కనిపించనున్నాడు. ప్రేరణగా పూజా హెగ్డే తన గ్లామర్‌తో ఆకట్టుకోనుంది. మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ప్రభాస్‌ తల్లిగా బాలీవుడ్‌ నటి భాగ్యశ్రీ నటిస్తుండగా.. కృష్ణం రాజు, జగపతి బాబులు కీలక పాత్రలో కనిపంచనున్నారు. భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా చిత్రంగా యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

జస్టిన్ ప్రభాకరన్ ‘రాధే శ్యామ్’( radhe shyam) సినిమాకు సంగీతం సమకూర్చారు. మనోజ్ పరమహంస (Manoj Paramahamsa)ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందించారు. కాగా, ఈ సినిమాపై అభిమానులు, ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. చిత్రబృందం చేస్తున్న సినిమా ప్రమోషన్స్‌ కూడా భారీ హైప్‌కు ఒక కారణం. ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతుండటంతో మేకర్స్‌ ప్రమోషన్‌ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న థియేటర్స్‌లో ఆస్ట్రాలజీ కౌంటర్ ఓపెన్ చేసారు. అక్కడ జ్యోతిష్యం చెప్తూ సినిమాకు వినూత్న రీతిలో ప్రమోషన్ కల్పిస్తున్నారు.