యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడుగా రూపొందిన ‘రాధేశ్యామ్’ సినిమా రిలీజ్ ను వాయిదా వేస్తూ అధికారిక ప్రకటన ఇచ్చింది చిత్రబృందం. ఈ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయాల్సిన ఈ సినిమాను కరోన మహమ్మారి వ్యాప్తి కారణంగా వాయిదా వేస్తున్నామంటూ నిర్మాతలు ప్రకటించారు. అయితే  పరిస్థితులు సానుకూలంగా ఉంటే మార్చి 18న ఈ సినిమాను విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తున్నారట.

ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని కూడా పాన్ ఇండియా మార్కెట్ ని దృష్టిలో పెట్టుకునే వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 29న విడుదల చేయాలని మేకర్స్ బావిస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే సంక్రాంతి రేసు నుంచి వైదొలిగిన రెండు భారీ సినిమాలు ఈ వేసవిలో అలరిస్తాయని చెప్పొచ్చు. కాగా, పీరియాడిక్ ల‌వ్ స్టోరీగా ఈ ‘రాధే శ్యామ్’ సినిమా తెరకెక్కించారు. కృష్ణంరాజు స‌మ‌ర్ప‌ణ‌లో యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌మోద్‌, వంశీ, ప్ర‌శీద ఈ సినిమాను నిర్మించగా.. ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే కథానాయికగా నటించింది.