మెహర్ రమేష్ (Mehar Ramesh) దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న చిత్రం ‘భోళా శంకర్’. తమన్నా (Tamanna Bhatia) హీరోయిన్గా చేస్తున్న ‘భోళా శంకర్’ (Bhola Shankar) మూవీలో చిరంజీవికి చెల్లెలుగా కీర్తి సురేష్(Keerthi Suresh) నటిస్తోంది. చిరంజీవి కెరీర్ లో155వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్స్‌పై కలిసి నిర్మిస్తున్నారు. తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన సూపర్ హిట్ చిత్రం ‘వేదాళం’ సినిమాకు రీమెక్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో శివరాత్రి కానుకగా మెగాస్టార్ (Mega Star) ఫ్యాన్స్ హుషారెత్తే అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ‘భోళా శంకర్’లో (Bhola Shankar) మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ లుక్‌ను మంగళవారం ఉదయం 9:05 గంటలకు రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో చిరంజీవి యంగ్ లుక్‌లో ఆకట్టుకుంటున్నారు. కార్ ముందు భాగంలో కూర్చొని చేతిలో త్రిశూలం ఆకరంలో ఉన్న చైన్ తిప్పుతూ.. పక్కా ఊరమాస్ లుక్‌లో కనిపిస్తున్నారు. కాగా, డూడ్లే సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ సినిమాకు మహతి స్వర సాగర్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నారు.
Recent Comment