భీంలా నాయక్ కి (Bheemla Nayak )సపోర్ట్ ఇచ్చాడు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్(Prakash Raj ). ఏపీలో సినిమా టికెట్స్ రేట్స్ విషయంలో జరుగుతున్న కాంట్రవర్సి గురించి ప్రకాష్ స్పందించాడు. సినిమా అనేది ఒక కళ అని ,అలాంటి సినిమాని ఇబ్బంది పెట్టడం సరికాదని ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఒకపక్క టికెట్స్ తగ్గించేసి సినీ పరిశ్రమను ఇబ్బంది పెడుతూనే,మరో పక్క ఇండిస్ట్రీని అభివృద్ధి చేస్తాం అంటూ మీడియాలో చెప్తే ఎలా నమ్ముతాం అంటూ ప్రకాష్ ప్రశ్నించాడు .

ఈ నేపథ్యంలో భీంలా నాయక్ (Bheemla Nayak )సినిమా గురించి కూడా ప్రకాష్ రాజ్(Prakash Raj ) మాట్లాడారు. ఒక పెద్ద హీరో సినిమా విడుదల అయినపుడు ఇలా వ్యవహరించడం సరికాదని తెలిపారు.సినిమాకి ఫ్యాన్స్, ప్రేక్షకులు అండగా ఉంటారని వారి ఆదరాభిమానాలు ఉంటే బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధిస్తుందని ,ఆ విజయాన్ని ఎవరూ ఆపలేరని ప్రకాష్ రాజ్ తెలియజేశారు.