ఎన్టీఆర్(NTR ), రాంచరణ్(Ram charan ) కాంబినేషన్లో రాజమౌళి (Rajamouli )450 కోట్లతో అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కించిన చిత్రం RRR. ఈ చిత్రం మార్చి 25న గ్రాండ్ గా విడుదల కాబోతోంది .ఈ నేపథ్యంలో ఈ మూవీ నుండి కొన్ని ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి.RRR మూవీ లో ఎన్టీఆర్ (NTR )చేసే ఒక భీకర పోరాటం ఉంటుందని ఇప్పటికే తెలిసిందే. ఈ పైట్ కి సంబంధించిన విజువల్స్ ఇప్పటికే ట్రైలర్ లో కూడా చూపించారు. ఇప్పుడు ఇలాంటి ఫైట్ ఈ మూవీలో మరొకటి ఉందట.

ఈ మూవీలో ఎన్టీఆర్ (NTR )ఒక భారీ ఆకారంలో ఉన్న మొసలితో చేసే పోరాటం సినిమాకు మరో హైలెట్ గా నిలవనుందట. ఇప్పటి వరకు దీని గురించి ఎలాంటి హింట్ ఇవ్వలేదు చిత్ర యూనిట్ .ఈ భారీ ఫైట్ గురించి న్యూస్ బయటకు వచ్చింది. పులితో అలాగే ముసలి తో ఎన్టీఆర్ (NTR )చేసే విన్యాసాలు ఎలా ఉంటాయి అన్నది ఇప్పుడు ఆడియన్స్ లో మరింత ఆసక్తిని రేపుతోంది. ఈ మూవీలో ఎన్టీఆర్(NTR ) కొమరం భీం గా రామ్ చరణ్(Ram charan ) అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న విషయం తెలిసిందే