మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi )నటించిన క్రేజీ ప్రాజెక్ట్ భోళా శంకర్ (bholasankar). తమిళ్ లో సూపర్ హిట్ అయిన వేదాళం సినిమాకి రీమేక్ గా ఈ సినిమా వస్తుంది. ఇక టాలీవుడ్ లో(Tollywood ) ఇప్పటి వరకూ హిట్ కొట్టని దర్శకుడు మెహర్ రమేష్ భోలాశంకర్ ని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో చిరుకు జోడిగా తమన్నా (Thamannah)నటిస్తుంది ,చెల్లిగా కీర్తి సురేష్ (Keerthy Suresh )నటిస్తోంది, ఈ చిత్రం నుండి అదిరిపోయే అప్డేట్ ఇచింది చిత్ర యూనిట్. మహాశివరాత్రి సందర్భంగా భోళా శంకర్(Bhola shankar ) నుండి చిరంజీవి ఫస్ట్ లుక్ ని రేపు ఉదయం 9.05 గంటలకు విడుదల చేయబోతున్నట్లు తెలియజేశారు.

ఈ ప్రాజెక్టు ఎలా ఉంటుంది చిరంజీవిని (Chiranjeevi )ఇందులో ఎలా చూపించబోతున్నాడు అన్నది ఆసక్తిగా మారింది. చిరంజీవి ఆచార్య మూవీ కూడా రిలీజ్ కి దగ్గరపడుతోంది. ఏప్రిల్ 29న రిలీజ్ కాబోతున్న ఆచార్య త్వరలోనే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరుపుకోబోతోంది. బిల్లా ,శక్తి ,షాడో లాంటి ఫ్లాప్ సినిమాలు తెరకెక్కించిన మెహర్ రమేష్ (Mehar ramesh )భోళా శంకర్ తో అయినా హిట్ అందుకుంటాడేమో చూడాలి.