దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli),
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్(Ntr), మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్(Ram Charan) ల కాంబినేష‌న్లో తెరకెక్కిన చిత్రం “ఆర్ఆర్ఆర్” (RRR) దాదాపు రూ. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ పాన్‌ ఇండియా మూవీలో కొమురం భీంగా ఎన్టీఆర్‌, అల్లూరి సీతరామారాజుగా రామ్‌ చరణ్‌ నటించారు. ఇందులో ఎన్టీఆర్ కు జోడిగా ఒలివియా మోరీస్‌, రామ్ చరణ్ కు జోడిగా అలియా భట్ నటించారు. డీవీవీ ఎంటర్‏టైన్మెంట్స్, పెన్ స్టూడియోస్, లైకా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీత స్వరాలు సమకూర్చారు.

ఈ సినిమా మార్చి 25న విడుదల కానుండగా.. ప్రమోషస్స్‌లో జోరు పెంచారు చిత్రబృందం. ఇదిలా ఉంటే.. తాజాగా ఆర్ఆర్ఆర్ మూవీ సెన్సార్ రిపోర్ట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఇక ఈ సినిమా ర‌న్ టైమ్ విహయనికొస్తే.. 3 గంటల 6 నిమిషాల 54 సెకన్లు. రాజమౌళి గత సినిమా బాహుబలి 2 మూవీ టైమ్ 2 గంటల 47 నిమిషాలు. ఇప్పుడు బాహుబలి – 2 మూవీ కంటే ఆర్ఆర్ఆర్ రన్ టైమ్ ఎక్కువగా ఉండటం విశేషం.