పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( pawan Kalyan ) అభిమానులు ఎదురుచూస్తున్నారు భీమానాయక్ ట్రైలర్ (Bheemla Nayak Trailer )వచ్చేసింది. ఈ రోజు రాత్రి 9 గంటలకు ట్రైలర్ ని విడుదల చేశారు. ట్రైలర్ లో పవన్ కళ్యాణ్ ,రానాలా(Rana ) మాస్ జాతరను చూపించారు .ఏంటి బాలాజీ స్పీడ్ పెంచారు అని డైలాగ్ వస్తుండగా ఇది పులులు తిరిగే ప్రాంతం సార్ అంటే పులి మందు కొట్టి పడుకుంది నువ్వు స్పీడ్ పెంచు అని బ్యాక్ గ్రౌండ్ లో వాయిస్ వస్తుండగా ట్రైలర్ స్టార్ట్ అయింది. డేనియల్ శేఖర్ గా రానా పవర్ఫుల్ విలన్ గా కనిపించగా, ఖాకీ చొక్కా వేసుకున్న సింహం పవన్ కళ్యాణ్ మరోసారి తన విశ్వరూపం చూపించాడు.

పోలీస్ స్టేషన్లో రానా, పవన్ కళ్యాణ్ మధ్య వచ్చే సన్నివేశాలు ట్రైలర్ కి హైలెట్ గా అయ్యాయి.తోలు తీస్తా నాకోడక, నాయక్ నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ,నీ గన్ లో బుల్లెట్ లేకపోతే మిస్ అదే నా బాడీలో బుల్లెట్ దొరికితే కేస్ అనే డైలాగ్స్ బాగున్నాయి. ఇక పవన్ ,రానా మధ్య వచ్చే ఫైట్ సీన్స్ హైలెట్ అయ్యాయి. మొత్తానికి భీంలా నాయక్ ట్రైలర్ యాక్షన్ సీన్స్ తో అదిరిపోయింది. ఇక ట్రైలర్ కి తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ .ట్రైలర్ తో అంచనాలు మరింత పెరిగాయి.