కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్(Punit raj kumar ) నటించిన ఆఖరి చిత్రం జేమ్స్(James ). ఈ సినిమా చివరి దశలో ఉండగా పునీత్ రాజ్ కుమార్(Punith Raj Kumar ) గుండె నొప్పితో మరణించారు. ఇక ఈ సినిమాని పునీత్ రాజ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 17 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు .దీనిలో భాగంగా మార్చ్ 6 న కర్ణాటకలో (James ) ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు చేశారు.ఈ ఈవెంట్ కి టాలీవుడ్ నుండి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi )అలాగే జూనియర్ ఎన్టీఆర్ ను(Ntr ) అతిథులుగా ఆహ్వానించారు.

వీరిద్దరూ కలిసి ఒకే వేదిక మీద కనిపించడం అభిమానులకు సంతోష పడే అంశం .దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారు చిత్ర యూనిట్. పునీత్ రాజ్ కుమార్(Punith Raj Kumar ), ఎన్టీఆర్(Ntr ) మధ్య చాలా అనుబంధం ఉంది .ఇద్దరూ కలిసి మంచి ఫ్రెండ్స్ గా, అన్నదమ్ములుగా ఉండేవారు ఇక పునీత్ నటించిన చక్రవ్యూహ అనే చిత్రంలో ఎన్టీఆర్ పాడిన గెలియ అనే పాట సూపర్ హిట్ అయింది. మరి చిరంజీవి ,ఎన్టీఆర్ ఒకే వేదిక మీద కనిపించడంతో జేమ్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మీద తెలుగులో కూడా ఆసక్తిని రేపుతోంది.