మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi), మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan )నటిస్తున్న చిత్రం ఆచార్య(Acharya ). ఈ సినిమాని ఏప్రిల్ 29 న గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. ఇక హిందీ లో కూడా డబ్ చేయనున్నారు. కొరటాల శివ(Koratala Siva ) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్(Kajal ) హీరోయిన్ గా నటిస్తోంది . ఇప్పటికే వచ్చిన టిజర్స్ ,సాంగ్స్ కి మంచి టాక్ వచ్చింది. ఇప్పుడు శివరాత్రి సందర్భంగా ఆచార్య సినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నట్టు సమాచారం.ఈ ట్రైలర్ తో అంచనాలు మరింత పెంచే ఛాన్స్ ఉంది.ట్రైలర్ కి సంబంధించిన పనులు కొరటాల శివ ఇప్పటికే పూర్తి చేసినట్టు సమాచారం.

ఇక ఆచార్య ఏప్రిల్ నెలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు . సైరా మూవీతొ హిట్ కొట్టిన చిరు ఆచార్య తో(Acharya ) మళ్ళీ హిట్ కొడతాడు అని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఇక భారి అంచనాలతో వస్తున్న ఆచార్య సినిమా హిట్ గా నిలిచి ఎంతవరకు కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.