ఇండియాలోనే (India )కాకుండా ప్రపంచ క్రికెట్ అభిమానులు సైతం ఎక్కువగా చూసే క్రికెట్ లీగ్ ఐపీఎల్(IPL ). ఈ లీగ్ కోసం తమ టీంకి కావాల్సిన ప్లేయర్స్ ని మెగా వేలంలో కొనుగోలు చేస్తుంటాయి యాజమాన్యాలు .ఇక ఈ మెగా వేలంలో ఎంతోమంది క్రికెటర్స్ కోటీశ్వరులు అవుతారు.మంచి అవకాశాలు అందుకుంటున్నారు. అలాగే కొంతమంది సీనియర్ ఆటగాళ్లు వేలంలో అమ్ముడు పోకుండా ఉండిపోతున్నారు .దీనిపై చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ రాబిన్ ఊతప్ప షాకింగ్ కామెంట్స్ చేశాడు. మెగా వేలం పెట్టకూడదని ,దాన్ని రద్దు చేయాలని తెలిపాడు.

2022 మెగా వేలంలో ఐపీఎల్ (IPL )లోని 10 టీమ్స్ 204 ప్లేయర్స్ ని కొనుగోలు చేయడానికి 551 కోట్లు ఖర్చు పెట్టాయి. ఇక ఈ సీజన్లో చాలా మంది సీనియర్ ప్లేయర్స్ అమ్ముడుపోలేదు. ఈ పద్ధతి బాగా లేదని చెన్నై సూపర్ కింగ్స్ (CsK )ఆటగాడు రాబిన్ ఊతప్ప(Rabin uthappa ) ఆవేదన వ్యక్తం చేశాడు. మెగా వేలంలో అమ్ముడు పోకపోతే చాలా బాధగా ఉంటుందని, అప్పటిదాకా స్టార్ ప్లేయర్ గా ఉన్నవాళ్లు చాలా తక్కువ అయిపోతారుని ,ఈ పద్ధతి మార్చుకోవాలని తెలిపాడు.రాబిన్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 2022 మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ రాబిన్ ని రెండు కోట్లకు కొనుగోలు చేసింది.