రాజమౌళి (Rajamouli), తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచేసిన వ్యక్తి.  బాహుబలి (Bahubali), తెలుగు సినిమా వ్యాపార స్థాయిని ఆకాశం అంత ఎత్తున నిలబెట్టిన సినిమా. 

ఇప్పుడు సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలే. పెద్ద హీరో ల సినిమాలు అయితే పాన్ వరల్డ్.  తెలుగు సినిమా మార్కెట్ ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా కాదు, అల్ ఇండియా. శాటిలైట్, డిజిటల్ హక్కుల రూపం లో, అన్ని భాషల్లో కలిపి సుమారు 60-80 కోట్ల వ్యాపారం జరుగుతోంది. 

ఈ మార్చ్ (March) నెలలోనే రెండు వేల కోట్ల వ్యాపారానికి తలుపులు తీస్తోంది తెలుగు సినిమా.

ప్రభాస్(Prabhas) హీరో గా వస్తున్న రాధే శ్యామ్ (Radhe Shyam) సినిమా బడ్జెట్ సుమారు 400 కోట్లు.  ప్రీ రిలీజ్ బిజినెస్ 500 కోట్ల పైనే.  దేశ వ్యాప్తం గా రెండు వేల కు పైగా థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు.  సుమారు 1000 కోట్లు వసూలు చేస్తుందని అంచనాలు వేస్తున్నారు.

ఈ నెల 25 న, రామ్ చరణ్ (Ram Charan), ఎన్టీఆర్ (NTR) ల RRR భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తం రిలీజ్ అవుతోంది.  ఇద్దరు అగ్రనటులు, అందునా రాజమౌళి (Rajamouli) దర్శకత్వ ప్రతిభ, ఆకాశమే హద్దు గా వసూళ్లు ఉంటాయని ఆశిస్తున్నారు.  RRR బడ్జెట్ 500 కోట్లు.  ప్రీ రిలీజ్ బిజినెస్ (pre-release business) 800 కోట్ల పైనే జరిగింది.  ఈ సినిమా టార్గెట్ వసూళ్లు కూడా 1000 కోట్ల పైనే.

ఇప్పుడు, ప్రపంచమంతా ఈ రెండు సినిమా ల వైపు ఆసక్తి గా చూస్తోంది.  ఈ రెండు సినిమాలు భారీగా విజయం సాధించి తెలుగు సినిమా ఖ్యాతి ని మరింత పెంచాలని ఆశిద్దాం.

అల్ ది వెరీ బెస్ట్ Team Radhe Shayam, Team RRR.