న్యూ జిలాండ్ లో ప్రారంభమైన మహిళల వన్ డే ప్రపంచ కప్ లో భాగం గా ఈ రోజు భారత, పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు నిర్ణీత 50 ఓవర్ ల లో ఏడు వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది.  ఓపెనర్ స్మ్రితి మందాన 52 పరుగులు, దీప్తి శర్మ 40 పరుగులు చేసి రాణించారు.  మరో ఓపెనర్, హిట్టర్ షెఫాలీ వర్మ డక్ అవుట్ అయ్యారు. 

కెప్టెన్ మిథాలీ రాజ్ అత్యంత పేలవం గా ఆడి 36 బంతుల్లో కేవలం 9 పరుగులు చేసి అవుట్ అయ్యారు.  అనంతరం వచ్చిన హర్మాన్, రిచా లు స్వల్ప స్కోర్ ల కే అవుట్ అవడంతో, భారత్ 114 పరుగులకే 6 వికెట్ల్య్ కోల్పోయి పీకల లోతు కష్టాల్లో పడింది.

అయితే  అనంతరం బ్యాటింగ్ కి వచ్చిన స్నేహ రానా, పూజ వస్త్రకర్ అద్భుతం గా ఆడడమే కాకుండా ఏదో వికెట్ కు 122 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నేలెకొల్పారు.

పూజ వస్త్రకర్ 67 పరుగులు చేయగా, స్నేహ రానా 53 పరుగులు చేసి అజేయం గా నిలిచింది