Prabhas Radhe Shyam Movie Promotions: “రాధే శ్యామ్” కోసం రంగంలోకి ప్రభాస్.. ఇక ఫ్యాన్స్ కి పునకాలే..!

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌(Prabhas), బుట్టబొమ్మ పూజ హెగ్డే(Pooja Hegde) జంటగా నటించిన పీరియాడికల్‌ లవ్ స్టొరీ మూవీ ‘రాధేశ్యామ్‌’ (Radhe Shyam) కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇప్పటి వరకు వచ్చిన అప్‌డేట్స్‌తో రాధేశ్యామ్ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇప్పుడు ఆ అంచనాలను మరో స్థాయికి తీసుకువెళ్ళేందుకు మేకర్స్ కొత్త తరహాలో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ప్రభాస్ మళ్ళీ ముంబైలో అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. ఇక్కడే ప్రభాస్ రాధే శ్యామ్ పై చాలా ఇంటర్వూస్ చేయనున్నట్లు సమాచారం. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ పై మరింత ఆసక్తి నెలకొంది. కాగా, గోపికృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, యూవీ క్రియేషన్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. రాధా కృష్ణ కుమార్ రాధే శ్యామ్ సినిమాను తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు.