DJ Tillu Final Collections: ‘డీజే టిల్లు’ బాక్సాఫీస్ దాడి.. ఫైనల్ కలెక్షన్స్‌తో సెన్సేషన్
సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం ‘డీజే టిల్లు’. విమల్ కృష్ణ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 12న విడుదలైంది. విడుదలైన తొలిరోజు నుంచే అదిరిపోయే వసూళ్లతో డీజే టిల్లు కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇండియా సహా ఓవర్సీస్‌లోనూ మంచి వసూళ్లు రాబట్టింది. ఈ మూవీ ‘ఆహా’లో శుక్రవారం నుండి స్ట్రీమింగ్ అవుతుంది.
అయితే ఈ మూవీ సక్సెస్ కావడంతో దీనికి సీక్వెల్ తెరకెక్కించే ప్లాన్‌లో ఉన్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో ఈ మూవీకి వచ్చిన ఫైనల్ కలెక్షన్ల రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం ..
★నైజాం : 7.11 కోట్లు
★సీడెడ్ : 1.88 కోట్లు
★ఉత్తరాంధ్ర : 1.39 కోట్లు
★ఈస్ట్ : 0.79 కోట్లు
★వెస్ట్ : 0.80 కోట్లు
★నెల్లూరు : 0.46 కోట్లు
★కృష్ణ : 0.66 కోట్లు
★గుంటూరు : 0.77 కోట్లు
★తెలంగాణ+ఆంధ్రప్రదేశ్: 13.86 కోట్లు (24.04 కోట్ల గ్రాస్)
★కర్ణాటక+రెస్ట్ఆఫ్ఇండియా : 1.01 కోట్లు
★ఓవర్సీస్ : 2.05 కోట్లు
◆మొత్తంగా ‘డీజే టిల్లు’ మూవీ ఫైనల్ కలెక్షన్స్..
●ప్రపంచ వ్యాప్తంగా : 16.92 కోట్లు (30.12 కోట్ల గ్రాస్)
Recent Comment