విక్టరీ వెంకటేష్,మెగా ప్రిన్స్ varuntej నటిస్తున్న మల్టీస్టారర్ కామెడీ మూవీ F3. అనిల్ రావిపూడి దర్శకత్వం లో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి .గతంలో వచ్చిన F2కి సీక్వెల్ గా తెరకెక్కుతోంది F3. ఇటీవల చేసిన లబ్ డబ్ అనే పాట సూపర్ హిట్ అయింది .దాంతో సినిమా క్రేజ్ మరింత పెరిగింది .F2 మూవీ కంటే మరింత వినోదాన్ని F3 చూపించబోతున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ మూవీని ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు .ఈ క్రమంలో ప్రమోషన్ జోరు పెంచాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. అందుకే F3 ట్రైలర్ ని మహాశివరాత్రి సందర్భంగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. F2 మూవీలో నటించిన తమన్నా, మెహరీన్, వెంకటేష్ ,వరుణ్ కి జోడి గా నటిస్తుండగా రాజేంద్ర ప్రసాద్ తో పాటు ఈసారి కమెడియన్ సునీల్ కూడా వినోదాన్ని పంచడానికి సిద్ధమయ్యాడు .దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో F3ని నిర్మిస్తున్నారు.పోస్టర్స్ తో ఆకట్టుకున్న F3 ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఎలాంటి రికార్డ్స్ కొడుతుందో చూడాలి