కమల్ హాసన్ (Kamal hassan )తాజాగా నటిస్తున్న చిత్రం విక్రమ్(Vikram ). తెలుగు(Telugu ), తమిళ(Tamil ) భాషల్లో భారీ స్థాయిలో ఈ మూవీ రూపుదిద్దుకుంటోంది. లోకేష్ కనకరాజు (Lokesh Kanaka raju )ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక కమల్ హసన్(Kamal Hassan ) కెరీర్లో 232 వ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. దాంతో యూనిట్ సభ్యులు సంబరాలు చేసుకున్నారు. టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ కావడంతో ఇక పోస్ట్ ప్రొడక్షన్ మీద దృష్టి పెట్టారు.

త్వరలోనే ఈ మూవీని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీకి తమిళం రాక్ స్టార్ అనిరుద్(Anirudh ) సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పటికే వి ఈ మూవీ నుండి విడుదల అయిన కమల్ హాసన్ (Kamal hassan )ఫస్ట్ లుక్ అలాగే టీజర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ మూవీలో ఒక రిటైర్డ్ ఏజెంట్ గా కనిపించబోతున్నారు. విశ్వరూపం తర్వాత కమల్ హాసన్ కి సరైన హిట్ లేదు. విక్రమ్(Vikram ) మూవీ తో అయినా అతను హిట్ అందుకుంటాడేమో చూడాలి.