Nag Ashwin- Anand Mahindra Conversation For Project K: ప్రభాస్-నాగ్ అశ్విన్ మూవీకి బంపర్ ఆఫర్ ఇచ్చిన ఆనంద్ మహీంద్రా
ప్రభాస్(Pranhas) హీరోగా నాగ్ అశ్విన్(Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ప్రాజెక్ట్ కె’( Project K). ఇందులో దీపికా పదుకోన్ కథానాయికగా నటిస్తుండగా, అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ పతాకాలపై అశ్వనీత్ దత్ దాదాపు రూ 500 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల చేయనున్నారు. అయితే పాన్ ఇండియా లెవెల్లో రూపొందిస్తున్న ఈ మూవీ కోసం వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రాను(Anand Mahindra) డైరెక్టర్ నాగ్ అశ్విన్ హెల్ప్ అడిగాడు. భారీ బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి సాంకేతిక సాయం అందించాలని రిక్వెస్ట్ చేశాడు.
ఈ మేరకు శుక్రవారం ఉదయం ఆనంద్ మహీంద్రాను ట్యాగ్ చేస్తూ నాగ్ అశ్విన్ ట్వీట్ చేశారు. “ప్రియమైన ఆనంద్ మహీంద్రా సర్, ప్రస్తుతం నేను.. అమితాబ్ బచ్చన్, ప్రభాస్, దీపికా పదుకొణె కలిసి ‘ప్రాజెక్ట్ కె’ అనే ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాను రుపొందిస్తున్నాము. అది మన దేశానికి గర్వకారణం గా నిలుస్తుంది. ప్రాజెక్ట్ కే సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమా కావడంతో ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీని మించిన వాహనాలను ఈ సినిమాలో ఉపయోగిస్తున్నాం. దీంతో ఈ ప్రాజెక్టుకి సంబంధించి మీ నుంచి సాంకేతిక సహాయం కావాలి” అంటూ ఆనంద్ మహీంద్రాను నాగ్ అశ్విన్ అడిగాడు.
అయితే, నాగ్ అశ్విన్ చేసిన ట్వీట్‌కు ఆనంద్ మహీంద్రా వెంటనే పాజిటివ్‌గా రిప్లై ఇచ్చాడు..”ఇంత గొప్ప అవకాశాన్ని ఎలా కాదంటాం చెప్పండి నాగ్ అశ్విన్.. మహేంద్ర గ్రూప్ గ్లోబల్ ప్రొడెక్ట్ డెవలప్‌మెంట్ ఛీఫ్ వేలు మహీంద్ర మీకు కావాల్సిన సాయాన్ని అందిస్తారు. అతను ఇప్పటికే ఎక్స్‌యువీ 700 కారును రూపొందించారు” అంటూ ఆనంద్ మహీంద్ర పేర్కొన్నారు. ఈ ట్వీట్‌కు దర్శకుడు నాగ్ అశ్విన్ ఆనందంతో ధన్యవాదాలు సార్ అంటూ తిరిగి రిప్లై ఇచ్చారు.
Recent Comment