2022 ipl మెగా వేలం ఆటగాళ్లను కోటీశ్వరులను చేస్తోంది .ఎలాంటి అంచనాలు లేని క్రికెటర్స్ కూడా కోట్ల ధరకు అమ్ముడు పోతున్నారు .కోట్లకు ధరకు అమ్ముడు పోయిన వారి జాబితాలో ఆస్ట్రేలియా బ్యాటర్ టీం డేవిడ్ కూడా చేరారు .ఆస్ట్రేలియా జట్టులో టీమ్ డేవిడ్ ఒక దూకుడు ప్లేయర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. BBl ,SPL లీగ్స్ లో అతని ప్రదర్శన చాలా మెరుగ్గా ఉంది .అదే ఇప్పుడు ఐపీఎల్ వేలంలో అతన్ని కోటీశ్వరుడు చేసింది. 40 లక్షల బేస్ ప్రైస్ తో మొదలైన టీమ్ డేవిడ్ వేలంలో అతని కోసం రాజస్థాన్, ఢిల్లీ ,జట్లు తీవ్రంగా పోటీ పడ్డాయి .కానీ చివరికి ముంబై ఇండియన్స్ జట్టు అతనికి 8. 25 కోట్లు పాడుకుని కొనుగోలు చేసింది .గత సీజన్లో ఆర్సిబి తరుపున కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు టీమ్ డేవిడ్ .ఆ మ్యాచ్లో కూడా కేవలం ఒక్కరు రన్ మాత్రమే చేశాడు, కానీ ఇటీవల కాలంలో జరిగిన టి 20 లీగ్స్ లో అతని ప్రదర్శన చాలా మెరుగ్గా ఉండడంతో అత్యధిక ధర పెట్టి ముంబై ఇండియన్స్ జట్టు అతని కొనుగోలు చేసింది.
Recent Comment