టీ20ల్లో టీమ్ ఇండియా వరుస విజయాలు అందుకుంటోంది. వెస్టిండీస్ తో వన్డే సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన భారత్, t20 సిరీస్ లో కూడా శుభారంభం చేసింది. కలకత్తాలో జరిగిన మొదటి టి20 మ్యాచ్ లో ఘన విజయం సాధించిన రోహిత్ సేన ఇప్పుడు టీ20 సిరీస్ మీద కన్నేసింది. రేపు వెస్ట్ఇండీస్ తో రెండవ టి 20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధిస్తే ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ గెలుస్తుంది .దీనిపై రోహిత్ సేన దృష్టిపెట్టింది .మొదటి టి20లో 157 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా సాధించిన భారత్ ,అదే స్థాయిలో రెండో మ్యాచ్ లో కూడా సమిష్టిగా రాణించాలని భావిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్లో టీమ్ ఇండియా సమాన స్థాయిలో ఉంది. యువ ఆటగాళ్లు అంచనాలకు తగ్గట్టుగా రాణిస్తున్నారు .ఇక సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీ కూడా ఫామ్ లోకి వస్తే రోహిత్ తనకు తిరుగు ఉండదు. మొదటి టి-20లో కోహ్లీ తక్కువ పరుగులు మాత్రమే చేశాడు .మరి రెండో టీ20లో అయినా కోహ్లీ తన స్థాయికి తగ్గట్టు బ్యాటింగ్లో రాణిస్తాడేమో చూడాలి. ఇక మొదటి టి-20లో ఆడిన చెట్టు తోనే రెండవ టీ20 లో కూడా రోహిత్ సేన బరిలోకి దిగబోతోంది.