ఇటీవల టీ20ల్లో దుమ్మురేపుతోంది టీమిండియా(Team India). రోహిత్ శర్మ కెప్టెన్(Rohit Sharma ) అయ్యాక వరుస విజయాలు అందుకుంటుంది. ఇక వెస్టిండీస్(Wi) తో జరిగిన మూడు మ్యాచ్ ల టీ-20 సిరీస్ ని క్లీన్ స్వీప్ చేసింది భారత్. వన్డే సిరీస్ ని గెలుచుకున్న భారత్ టీ 20 సిరీస్ ని కూడా వైట్వాష్ చేసి మూడు మ్యాచ్ ల్లో విజయం సాధించి సిరీస్ కొట్టేసింది(IND vs wi) .దాంతో టీ20ల్లో నెంబర్ వన్ ర్యాంక్ కి లోకి దూసుకొచ్చింది రోహిత్ సేన. 10 484 పాయింట్స్ తో టీం ఇండియా మొదటి ర్యాంకులోకి అడుగు పెట్టింది.

ఇక 10 474 పాయింట్స్ తో ఇంగ్లాండ్ రెండో స్థానానికి పడిపోయింది. వన్డే సిరీస్ అలాగే టీ 20 సిరీస్ ని గెలిపించి, టీ20ల్లో భారత్ కి (India )మొదటి ర్యాంకు వచ్చేలా చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma )పై ప్రశంసలు దక్కుతున్నాయి .భారత్ టి 20 ల్లో మొదటి ర్యాంక్ లో ఉండగా ఇంగ్లాండ్(England) రెండో స్థానంలో, న్యూజిలాండ్ 3(New Zealand), సౌత్ ఆఫ్రికా 4(South Africa ), ఆస్ట్రేలియా(Australia) ఐదు స్థానాలు ఉన్నాయి.