శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు , పరమ పవిత్రమైన మాఘ మాసం. శ్రీమన్నారాయణుడికి ఎంతో ఇష్టమైన శుక్ల ఏకాదశి తిథి. ఫిబ్రవరి 12, శనివారం, భీష్మ ఏకాదశి. విష్ణు పూజకు అత్యంత అనుకూలమైన పవిత్ర పర్వదినం. ఈ రోజునే విష్ణు సహస్ర నామం ఉద్బవించిందని పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకే దీనిని విష్ణు సహస్ర నామ జయంతి అని కూడా అంటారు. విష్ణు సహస్రనామ విశిష్టతను భీష్ముడు పాండవులకు వివరించి, కురుక్షేత్ర యుద్ధంలో వారి విజయానికి భీష్ముడు కారణమయ్యాడు.
భీష్ముడు అందించిన విష్ణుసహస్రనామాలను ఈరోజున పటిస్తే, విశేష ఫలితం దక్కుతుంది. కాబట్టే దీనిని శ్రీ విష్ణు సహస్రనామ జయంతి అని కూడా అంటారు.
ఏడాదిలో ఏ రోజు విష్ణు సహస్రనామం పాటించినా వారు ఈ రోజు విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే ఆ ఫలితం అద్భుతంగా ఉంటుంది. అనుకున్న పనులు చక్కగా నెరవేరుతాయి. భోగభాగ్యాలు కలుగుతాయి. అలాగే గ్రహదోషాలు, నక్షత్రదోషాలు ఉన్నవారుకూడా విష్ణు సహస్రనామాన్నిఈ రోజు చదివితే చాలు అన్నింటి నుంచి విముక్తిపొందడమే కాకుండా అన్నింటా విజయం సాధిస్తారు. భీష్మ ఏకాదశి రోజున యాదగిరి నరసింహస్వామి ఆలయం , అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం, సింహాచలం వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం, భద్రచాలం సీతారాముల వారి ఆలయంలోనూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
Recent Comment