కింగ్ నాగార్జున యువ సామ్రాట్ నాగ చైతన్య కాంబోలో సంక్రాంతి బరిలో దిగి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచిన చిత్రం ‘బంగార్రాజు.
కళ్యాణ్ కృష్ణ కురసాల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సూపర్ నేచురల్ డ్రామా లో
ఆకట్టుకునే కథకథనాలు, అనూప్ సంగీతం, కృతి శెట్టి గ్లామర్ , రమ్య కృష్ణ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాను మాస్ ప్రేక్షకులకు దగ్గర చేశాయి. సక్సస్ ఫుల్ థియేట్రికల్ రన్ తర్వాత, తండ్రీ కొడుకులిద్దరూ OTT ప్లాట్‌ఫారమ్‌లో అదే మ్యాజిక్‌ను రీపిట్ చేసేందుకు ZEE5 లో ఫిబ్రవరి 18న
ప్రీమియర్‌కు సిద్దం అయింది.ఈ మేరకు
బుధవారం, Zee5 తెలుగు అఫిషియల్ ఇన్‌స్టాగ్రామ్‌
హ్యాండిల్ లో మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. బంగార్రాజు OTT ఫిబ్రవరి 18, 2022న Zee 5లో స్ట్రీమింగ్ ప్రారంభమవుతుంది.ఇదే న్యూస్ ను షేర్ చేస్తూ,..
స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ పోస్ట్-“వాసివాడి తస్సదియ్యా! ఫిబ్రవరి 18 నుండి సోగ్గాడు #బంగర్రాజు మన ఇంటికి వస్తున్నాడు ప్రత్యేకంగా మీ #ZEE5 లో” అని శీర్షిక పెట్టింది.
సోగ్గాడే చిన్ని నాయన చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన బంగార్రాజు చిత్రాన్ని జీ స్టూడియోస్ మరియు అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్మించారు.ఇక.చైతూ చేస్తోన్న సినిమాల విషయానికి వస్తె
ప్రస్తుతం చైతూ డైరెక్టర్ విక్రమ్ కుమార్‌తో థాంక్యూ అనే మూవీ,అమీర్ ఖాన్ తో లాల్ సింగ్ చద్దా మూవీస్ చేస్తున్నారు.