శర్వానంద్(Sharwanand ), రష్మిక (Rashmik )జంటగా నటించిన క్రేజీ చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు(Aadavallu meeku joharlu ). ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ మూవీని తెరకెక్కించాడు దర్శకుడు తిరుమల కిషోర్. ఇక ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ (DSP )అందించిన సంగీతం సూపర్ హిట్ గా నిలిచి సినిమాపై అంచనాలు పెంచేసింది .

ఇక రీసెంట్ గా జరిగిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ మూవీ ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ మొత్తం సరదాగా ,వినోదభరితంగా సాగింది. హీరో పెళ్లిచూపులుకి వెళ్లడం కానీ అతను చూసిన అమ్మాయికి వేరే వాళ్ళతో త్వరగా పెళ్లి అవడం,హీరోకి మాత్రం పెళ్లి విషయంలో లేట్ అవడం అనే కాన్సెప్ట్ తో ఈ మూవీని తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ట్రైలర్ లో కామెడీ అంశాలతో పాటు రష్మిక మందనతో (Raahmika )వచ్చే లవ్ సీన్స్ కూడా యూత్ ని బాగా ఆకట్టుకునేలా ఉన్నాయి.

ఇక సీనియర్ నటీమణులు రాధిక (Radhika ),ఊర్వశి(Uoorvasi ) వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. ఆడవాళ్లు మీకు జోహార్లు(Aadavaallu meeku joharlu ) ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా చూసే సినిమా అని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. మరి మార్చి 4 న విడుదలవుతున్న ఈ మూవీ శర్వానంద్(Sharwanand )కి హిట్ ఇస్తుందా లేదా అన్నది చూడాలి.