మోహన్‌రాజా(Mohan Raja) దర్శకత్వంలో చిరంజీవి(Chiranjeevi) గాడ్‌ఫాదర్‌(God Father) అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మలయాళ సూపర్‌ హిట్‌ చిత్రం లూసిఫర్‌కి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా.. బాలీవుడ్‌ సూపర్ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌(Salman Khan) కీలక పాత్రలో నటించనున్నాడు. ప్రస్తుతం ‘గాడ్ ఫాదర్’ సినిమా రెగ్యులర్ షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో చిరంజీవి, సల్మాన్ ఖాన్‌ల‌పై కీలక స‌న్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా కొత్త స్టిల్ ఒక‌టి విడుదల చేశారు మేకర్స్. గాడ్ ఫాద‌ర్ చిత్రబృందం అంద‌రికీ ఇండియా మోస్ట్ ఫేవ‌రేట్ భాయ్ స‌ల్మాన్‌ఖాన్‌తో అపురూపమైన క్ష‌ణాలు అంటూ సంగీత దర్శకుడు థ‌మ‌న్ ట్విట‌ర్ లో ఫోటోలు, వీడియో షేర్ చేశాడు. ఇందులో ఫుల్ స్టయిలిష్ గా ఉన్న సల్మాన్ ఖాన్ లుక్ అందర్నీ ఆకట్టుకుంటోంది. కాగా, తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సూపర్ గుడ్ ఫిల్మ్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.