RRR – Pre Release Event: ‘RRR’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం కళ్ళు చెదిరే ఏర్పాట్లు.. రాజమౌళి నయా స్కెచ్!

ఇద్దరు గొప్ప స్వాతంత్ర్య సమరయోధులు ఓ మంచి పని కోసం ఏకమైతే ఎలా ఉంటుంది? అన్న డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌(రౌద్రం రణం రుధిరం)(RRR). ఇందులో కొమురం భీమ్‌గా జూనియర్‌ ఎన్టీఆర్‌(NTR), అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌(RAM CHARAN) ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. పాన్‌ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చెర్రీతో ఆలియా భట్‌(ALIA BHATT) జోడీ కడుతుండగా తారక్‌కు జంటగా హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరిస్‌ నటించనున్నారు. అజయ్ దేవ్‌గన్(AJAY DEVGAN) ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం మార్చి 25, 2022న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

అయితే విడుదల తేది దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ వేగవంతం చేశారు మేకర్స్. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్(RRR – Pre Release Event) నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. కళ్ళుచేదిరే ఏర్పాట్లతో హైదరాబాద్‌తో పాటు బెంగళూరులో ఈ వేడుక కోసం ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. మరో రెండు రోజుల్లో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లకు సంబంధించిన డేట్స్ అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తోంది.