బిగ్‌బాస్(Bigg Boss) ఫ్యాన్స్ కు గుడ్‌న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ రియాలిటీ షో ఇప్పుడు ఓటీటీ వేదికగా అలరించేందుకు సిద్ధమైంది. ‘బిగ్‌బాస్ నాన్‌స్టాప్’ (Bigg Boss OTT Telugu) పేరుతో ‘డిస్నీ+ హాట్‌స్టార్’లో ఈనెల 26 నుంచి ఈ షో స్ట్రీమింగ్ కానుంది. ఇక కంటెస్టెంట్ల విషయానికి వస్తే చాలామంది పాత కంటెస్టెంట్లను తీసుకున్నట్లు తెలుస్తుంది. వీరితో పాటు సోషల్‌మీడియా నుంచి కొందరు పాపులర్ వ్యక్తులను ఈ షోలోకి తీసుకున్నారు.
అయితే బిగ్ బాస్ ఓటీటీ(Bigg Boss OTT) లో చాలామంది పాత కంటెస్టెంట్లనే తీసుకోవడంపై బిగ్ బాస్ సీజన్ 2 రన్నరప్, ప్రముఖ సింగర్ గీతా మాధురి( Geetha Madhuri) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజానికి గీతా మాధురికి కూడా బిగ్ బాస్ ఓటీటీ ఆఫర్ వెళ్ళింది. కానీ ఆమె ఆ ఆఫర్ ను తిరస్కరించింది. ఈ క్రమంలో తాజాగా ఓ కార్యక్రమంలో గీతా మాధురి మాట్లాడుతూ బిగ్ బాస్ ఓటీటీపై కీలక వ్యాఖ్యలు చేశారు.
బుల్లితెరపై ప్రేక్షకుల్ని ఎంతగానో అలరిస్తున్న బిగ్‌బాస్ షో ఇప్పుడు ఓటీటీ వేదికగా రావడం చాలా సంతోషంగా ఉంది. బిగ్ బాస్ ఓటీటీ ఆఫర్ నాకు కూడా వచ్చింది. కానీ నా బిజీ షెడ్యూల్ వల్ల సున్నితంగా తిరస్కరించాను. నా అభిప్రాయం ప్రకారం ఈ షోలో కొత్త వాళ్ళకే కప్పు వస్తుంది. సెకండ్ హ్యాండ్ వాళ్ళను ఎవ్వరూ పట్టించుకోరు. అయితే , ఇందులో పాల్గొనే మాజీ కంటెస్టెంట్లకు నేనిచ్చే సలహా ఏంటంటే.. మిమ్మల్ని ప్రేక్షకులు ఎక్కువగా గమనిస్తూ ఉంటారు. కాబట్టి మీరు జాగ్రత్తగా మాట్లాడాలి.. ఎల్లప్పుడూ మీరు నోరు అదుపులోనే పెట్టుకోవాలి. చాలా జాగ్రత్తగా ఆడాలి అంటూ మాధురి చెప్పుకొచ్చారు.
Recent Comment