క్రాక్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తరవాత మాస్ రాజా రవితేజ నటించిన సినిమా ఖిలాడి. డింపుల్ హాయాతి ,మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా యాక్షన్ కింగ్ అర్జున్ కీలక్ పాత్రలో, రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఖిలాడి ఫిబ్రవరి 11 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. ఇక ఆడియన్స్ నుండి మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఖిలాడి మొదటి రోజు మంచి కలెక్షన్స్ రాబట్టింది.ఈ మూవీ ఫస్ట్ డే 7 కోట్లా దాకా కలెక్షన్స్ అందుకుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో 5.5 కోట్ల వరకు గ్రాస్ సాధించిన ఖిలాడి, ఓవర్సీస్, రెస్ట్ ఆప్ ఇండియాలో 1.5 కోట్ల వరకు రాబట్టింది. టోటల్ గా 7 కోట్ల వరకు గ్రాస్ సాధించి మంచి ఓపెనింగ్ దక్కించుకుంది. టాలీవుడ్, బాలీవుడ్ అలాగే ఓవర్సీస్ తో కలుపుకుని 25 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది ఖిలాడి.ఈ సినిమా హిట్ ఖాతాలో చేరాలంటే 26 కోట్లకు పైగా కలెక్ట్ చెయ్యాలి.తెలుగులో ఖిలాడి తప్ప ఇంకా వేరే పెద్ద సినిమాలు లేకపోవడం ఈ మూవీకి కలిసి వచ్చే అంశం .మరి టోటల్ రన్ లో మాస్ రాజా రవితేజ ఖిలాడి ఎన్ని కోట్లు వసూల్ చేసి బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి హిట్ గా నిలుస్తుందో చూడాలి.