మహేష్ బాబు ( Mahesh Babu ) త్రివిక్రమ్(Trivikram ) కాంబినేషన్ లో వస్తున్న మూడవ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే వీరి కాంబినేషన్లో వచ్చిన అతడు(athadu ) సూపర్ హిట్ కాగా ఖలేజా ఫ్లాప్ గా మారింది. మళ్లీ ఇన్నాళ్లకు వీరి కాంబినేషన్లో మూవీ వస్తోంది .ఇటీవల పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇక ఈ మూవీలో మహేష్ బాబు (Mahesh babu )కి ఒక పిన్ని క్యారెక్టర్ ఉందట. ఈ పాత్ర కోసం ఒక సీనియర్ నటిని తీసుకోవాలని త్రివిక్రమ్ శ్రీనివాస్ భావిస్తున్నారట.

ఇటీవల కాలంలో త్రివిక్రమ్ (Trivikram )సినిమా లో సినీ హీరోయిన్స్ ని ఎక్కువగా తీసుకుంటున్నాడు. అత్తారింటికి దారేది (Attarintiki daaredi )లో నదియా (Nadiya )అజ్ఞాతవాసి లో ఖుష్బూ అల వైకుంఠపురం లో టబులకు ముఖ్య పాత్రలు ఇచ్చిన త్రివిక్రమ్ ,తాజాగా మహేష్ బాబు సినిమాలో సీనియర్ నటి శోభన తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. శోభన ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం ఆమె సినిమాలు చేయడం లేదు ,కానీ ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాలని భావిస్తోందట. అందుకే త్రివిక్రం ఆమెతో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. మరియు సోషల్ మీడియాలో వస్తున్నట్టుగా మహేష్ బాబు ,త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో శోభన ముఖ్య పాత్రలో కనిపిస్తుందా లేదా అన్నది చూడాలి.