పవన్‌ కల్యాణ్‌, రానా ప్రధాన పాత్రల్లో నటించిన మల్టీస్టారర్‌ మూవీ ‘భీమ్లా నాయక్‌’. కాగా, సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో నిత్యా మీనన్‌ , సంయుక్త మీనన్‌ కథానాయికలుగా నటించారు. మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ తెలుగు రీమేక్‌గా సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఫిబ్రవరి 25వ తేదీన విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది.

అయితే తాజాగా “భీమ్లా నాయక్‌” సినిమా ఓటీటీ విడుద‌ల‌కు కూడా సిద్ద‌మ‌వుతున్న‌ట్టు చిత్రబృందం ప్రకటించింది. మార్చి25న ఈ సినిమాని ఒకేసారి డిస్నీ+ హాట్‌స్టార్‌తో పాటు ఆహాలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా మార్చి 25న ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ కూడా రిలీజ్ కానుండగా.. అదే తేదీన భీమ్లా నాయక్‌ కూడా ఓటీటీలో రానుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.