OTT ప్లాట్ ఫారం లు పోటీ పడి మరీ సినిమా దిగిత హక్కులను సొంతం చేసుకుంటున్నాయి. ఒక్కొక్క సారి, శాటి లైట్ హక్కుల కన్నా, డిజిటల్ హక్కులు ఎక్కువ ధరలు పలుకుతున్నాయి. Amazon, Hostar, Aha, Sun Nxt, Zee5, Sony Liv వంటి OTT ప్లాట్ ఫారం లు తెలుగు సినిమా డిజిటల్ హక్కుల కోసం పోటీ పడుతున్నాయి.

రాబోయే సినిమాలలో, రాధే శ్యామ్ (Radhe Shyam) డిజిటల్ హక్కులు జీ 5 (Zee 5) చేజిక్కించుకుంది.  దీనితో పాటు, RRR డిజిటల్ హక్కులు జీ 5 కూడా వద్దే వున్నాయి. RRR సౌత్  శాటి లైట్ హక్కులు మాత్రం డిస్నీ హాట్ స్టార్ (Disney Hot Star) వద్ద ఉన్నాయ్.   RRR హిందీ శాటి లైట్  హక్కులు మాత్రం Zee Network వద్ద ఉన్నాయ్.   RRR హిందీ డిజిటల్  హక్కులు మాత్రం Netflix వద్ద ఉన్నాయ్. 

ఇవే కాకుండా, జీ నెట్వర్క్ వాళ్ళు తేజ సజ్జా (Teja Sajja) హీరో గా, ప్రశాంత్ వర్మ (Prashant Varma) దర్శకత్వం లో వస్తున్న హనుమాన్ (Hanuman) చిత్రం శాటి లైట్ మరియు డిజిటల్ హక్కులు ఇప్పటికే కొనేశారు.

అంతే కాకుండా KGF2, F3 చిత్రాల శాటి లైట్ హక్కులు కూడా జీ నెట్వర్క్ వారి వద్దనే ఉన్నాయ్