టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన క్రేజీ సినిమా DJ Tillu.ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా మంచి అంచనాలతో ఈరోజు విడుదల అయ్యింది. dj tillu సాంగ్స్ సూపర్ హిట్ అవ్వడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. యూత్ ఈ సినిమా చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. హీరో siddhu ,హీరోయిన్ నేహా శెట్టి ( Neha Shetty ) జంటగా దర్శకుడు విమల కృష్ణ ( Vimal Krishna ) తీసిన రొమాంటిక్ క్రైం కామెడీ చిత్రం dj tillu.
కథ : dj tillu పెళ్ళిలకు, ఫంక్షన్స్ కి dj కొట్టే ఒక ఎనర్జిటిక్ కుర్రాడు.హ్యాపీ గా సాగుతున్న tillu లైఫ్ లోకి హీరోయిన్ రాధికా ( Neha Shetty ) ఎంటర్ అవుతుంది. కలిసిన ఒక మీటింగ్ లొనే dj tillu తో ప్రేమలో పడుతుంది neha shetty.టిల్లు తన ఫంక్షన్స్ తో బిజీగా ఉండగా ఒకరోజు తన ప్లాట్ కి రమ్మని పిలుస్తుంది రాధిక ( Neha Shetty ) . లవర్ కోసం రాధిక ప్లాట్ కి వెళ్లిన tillu అక్కడ ఒక డెడ్ బాడీ చూసి షాక్ తగులుతుంది. మర్డర్ కేసులో ఇరుక్కున్న టిల్లు, రాధిక ఎలా బయట పడ్డారు. అసలు వీళ్ళను మర్డర్ కేసులో ఇరికించింది ఎవరు అనేది మిగత కథ.
నటి నటులు : dj tillu గా సిద్ధు ( Siddhu ) అద్భుతంగా నటించాడు.టిపికల్ హైదరాబాద్ యువకుడిగా సిద్ధు నటన ఆడియన్స్ ని అలరిస్తుంది.తెలంగాణ స్లాంగ్ లో సిద్ధు చెప్పే డైలాగ్స్ థియేటర్ లో మంచి రెస్పాన్స్ తెచ్చుకునేల ఉన్నాయి.ఇక హీరోయిన్ నేహా శెట్టి అందంతో పాటు నటనలో కూడా ఆకట్టుకుంది.ప్రిన్స్ ,బ్రమ్మాజి పాత్రలు ఒకే అనిపించేలా ఉన్నాయి. dj tillu ఫస్ట్ ఆప్ చాలా బాగుంది.ఇక సెకండ్ లో కొంచెం ల్యాగ్ అయిన టోటల్ గా ప్రేక్షకులకు వినోదం పంచెల ఉంది .ఇక ఈ సినిమాకి ప్రమోషన్స్ కూడా భారీ స్థాయిలో చేయడంతో పాటు మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో dj tillu పైసా వసూల్ సినిమాగా నిలిచే ఛాన్స్ ఉంది.
Recent Comment