పరభాషా చిత్రాలు తెలుగు వెండి తెరకు కొత్తేమీ కాదు. కాకపోతే మన తెలుగు సినిమా పక్క రాష్ట్రాల్లో సక్సస్ అయిన విధంగా రేంజ్ లో వేరే చిత్రాలు మన దగ్గర ఆ రేంజ్ లో సక్సస్ కాకపోవడం గమనార్హం.
ఉదాహరణకు చాలా డబ్బింగ్ చిత్రాలు చెప్పుకోవచ్చు. భారీ అంచనాలతో తెలుగు లో స్ట్రెయిట్ సినిమా రేంజ్ లో హైప్ క్రియేట్ చేసినా సరే ఒకటి అరా తప్ప మిగిలిన చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిన సందర్భాలు కోకొల్లలు. ఈ క్రమంలో భారీ అంచనాలతో ఏప్రిల్ 13 న రిలీజ్ అయిన కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా వచ్చిన భీస్ట్ చిత్రం ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుందో మన వార్తా వినోదం పాఠకులకు ప్రత్యేక సమీక్ష అందిస్తున్నాం.

ఈ చిత్రం లో
విజయ్ సరసన బట్టబొమ్మ పూజా హెగ్డే నటించగా సెల్వరాఘవన్, యోగి బాబు చాలా పవర్ ఫుల్ పాత్రలు పోషించారు.
నెల్సన్ దిలీప్‌ కుమార్ డైరెక్షన్లో వచ్చిన బీస్ట్ చిత్రాన్ని ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ
సన్ పిక్చర్స్ అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో నిర్మించడం విశేషం.
మ్యూజిక్
సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి తన స్టన్నింగ్ విజువల్స్ తో ఔట్ స్టాండింగ్ సినిమాటోగ్రఫీ అందించారు మనోజ్ పరమహంస

ఇక. .ఈ చిత్ర కథాకథనాల విషయానికి వస్తె ..

వీర రాఘవ పాత్రధారి ‘రా’ ఏజెంట్ గా
హీరో విజయ్ తన ఔట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ తో దుమ్మురేపాడు అని చెప్పాలి. ఒక ఉమర్ ఫరూక్‌ అనే టెర్రరిస్ట్ నాయకుడిని పట్టుకునే మిషన్‌ ను వీర రాఘవ లీడ్ చేస్తాడు. ఆపరేషన్ కూడా సక్సస్ అవుతుంది. ఈ క్రమంలో వీర రాఘవ ఈ టెర్రరిస్ట్ ఆపరేషన్ చేస్తున్న సమయం లో బై మిస్టేక్ ఓ పాప ప్రాణాలు కోల్పోతుంది.
ఆ పాప మరణానికి కారణం తనే ఆని వీర రాఘవ గిల్ట్ ఫీల్ అయి ‘రా’ నుంచి బయటకు రావడం జరుగుతుంది.
ఇలా కొన్ని నెలలు గడిచిన తర్వాత జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ అనంతరం వీరాను చూసి ప్రీతి పాత్రధారి పూజ హెగ్డే వీరా ప్రేమలో పడుతుంది. అంతలో చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ మాల్ ను ఉగ్రవాదులు ముట్టడి చేసి ఉమర్ ఫరూక్‌ను రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తారు. అయితే, కొన్ని నాటకీయ పరిణామాల మధ్య వీరా కూడా ఆ సమయంలో ఆ మాల్‌ లోనే ఉంటాడు. మరి వీరా ఉగ్రవాదుల నుంచి ప్రజలను ఎలా కాపాడాడు ? వీరాకి , ఉగ్రవాదులకు మధ్య వార్ సన్నివేశాలు.. వీరా గెలిచిన తీరు వెండితెరపై చూడాల్సిందే.

ఇక..బీస్ట్ చిత్రం లో టెక్నికల్ వాల్యూస్ మరియు టెక్నీషియన్స్ పనితీరు గురించి చెప్పాలంటే … ఈ చిత్ర దర్శకుడు నెల్సన్ క‌మ‌ర్షియ‌ల్ అంశాలకి సామాజిక అంశాలు కలిపి ఈ స్క్రిప్ట్ పెర్ఫెక్ట్ గా రెడీ చేసుకున్నారు. అయితే..ఎంత సామాజిక అంశాలు రంగరించినా సరే ..సగటు ప్రేక్షకుడికి ఓ రెగ్యులర్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాను చూసినట్టే అనిపిస్తుంది.కానీ దర్శకత్వ ప్రతిభ మాత్రం సూపర్బ్ అనే చెప్పాలి. తను చెప్పాలి అనుకున్న కథను నూటికి నూరు శాతం చెప్పి మెప్పించాడు.కానీ కొన్ని లాజిక్స్ మిస్ అయినట్లు అనిపిస్తుంది.గూస్ బoప్స్ పుట్టించే
యాక్షన్ సీక్వెన్స్లు సినిమా కు ఎస్సెట్ .
పాటలు సో సో గా ఉన్నా..బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అనిరుధ్ దుమ్ము రేపాడు.
సినిమాటోగ్రఫర్ మనోజ్ పరమహంస ,
ఎడిటర్ అర్ నిర్మల్ తమ ఎక్స్ట్రార్డినరీ వర్క్ తో ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.
టోటల్ గా చెప్పాలంటే హై రేంజ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

ప్లస్ పాయింట్స్:

ఈ చిత్రంలో విజయ్ లుక్ చాలా బాగుంది.
ముఖ్యంగా రా ఏజెంట్ గా విజయ్ నటన హైలెట్ అని ఖచ్చితంగా చెప్పాలి. విజయ్ గత చిత్రాలతో పోల్చి చూస్తే
చాలా ఫ్రెష్ ఫీల్ కలుగుతుంది

ఇక..గ్లామర్ క్వీన్
పూజ హెగ్డేతో కెమిస్ట్రీ ,లవ్ సీన్స్ , సాంగ్స్ సూపర్బ్.

ఇక డైరెక్టర్ నెల్సన్ ప్రతిభ గురించి చెప్పాలి అంటే..స్టోరీ మెయిన్ ప్లాట్ పాయింట్ తోనే ఆకట్టుకున్నారు.
మాల్ లో విజయ్, యోగిబాబు ల కామెడీ సన్నివేశాలకు కడుపుబ్బ నవ్వు కోవచ్చు.విలన్ మరియు ఉగ్రవాదులకు సంబంధించిన సీన్స్ తో మరియు కొన్ని యాక్షన్ సీన్స్ తో ఈ చిత్రంలో కొన్ని ఎలిమెంట్స్ మాస్ ఆడియన్స్ కు కనెక్ట్ అవుతాయి.ఓవరాల్ గా చెప్పాలంటే డైరెక్టర్ హార్డ్ వర్క్ ప్రతి ప్రేమ్ లో కనిపిస్తుంది.

మైనస్ పాయింట్స్:
ఈ చిత్రం ఓ రొటీన్ మాస్ స్టోరీ అని సగటు ప్రేక్షకుడికి కలుగుతుంది.
స్టోరీ లో మెయిన్ పాయింట్ కన్విన్సింగ్ గా ఉన్నా సరే ..కదా కథనాల విషయంలో కొత్తదనం లేదు . సినిమాటిక్ లిబర్టీ పైనే ఎక్కువగా డిపెండ్ అయి లాజిక్స్ మరచిపోవడం ఈ సినిమాకు మైనస్ అనే చెప్పాలి. స్క్రిప్ట్ పై ఇంకాస్త వర్క్ చేస్తే బాగుండేది.
పూజా పాత్ర మరింత బలంగా రాసి ఉంటే బాగుండేది.

చివరిగా చెప్పొచ్చేదేమిటoటే..
భారీ అంచనాల మధ్య పక్కా యాక్షన్ డ్రామాతో బీస్ట్ గా వచ్చిన విజయ్ లుక్ , యాక్టింగ్ కోసమే ఈ చిత్రాన్ని చూడాలి తప్ప మరో ప్రత్యేకత లేదని చెప్పాలి.
వార్తా వినోదం రేటింగ్ 5/10

శ్రీనివాస్ నేదునూరి