మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సైర సినిమాతో పాన్ ఇండియా లెవల్లో ఎంత పెద్ద విజయం సాదించిందో తెలిసిందే. ఇపుడు వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం భోళాశంకర్(Bhola Shankar ),ఆచార్య(Acharya ), గాడ్ ఫాదర్(God Father ) షూటింగ్స్ జరుగుతున్నాయి. ఇక గాడ్ ఫాదర్ సినిమా విషయానికి వస్తే మళయాళ సూపర్ హిట్ లూసిఫర్ సినిమాకి రీమెక్ చేస్తూ గాడ్ ఫాదర్ పేరుతో వస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi ).
మోహన్ రాజ (Mohan raja )దర్శకత్వంలో , కొణిదెల సురేఖ సమర్పణలో ,సూపర్ గుడ్ ఫిలిమ్స్ బేనర్ పై నిర్మిస్తున్నారు.ఇప్పటికే విడుదల అయిన టైటిల్ పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది .ఇక గాడ్ ఫాదర్ మొదటి టీజర్ మార్చి నెలలో వదిలేందుకు దర్శక నిర్మతలు సిద్ధం అవుతున్నారు. శివరాత్రికి గాడ్ ఫాదర్ నుండి టీజర్ రాబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల టాక్ .
Recent Comment