అఖండ (Akhanda )లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత గోపీచంద్ మలినేని తో సినిమా మొదలు పెట్టాడు బాలకృష్ణ(Balakrishna ). నటసింహం కెరీర్లో 107వ(NBK 107 ) మూవీగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో బాలయ్య(Balakrishna ) రెండు గెటప్స్ లో కనిపిస్తారని సమాచారం .ఇక ఈ సినిమా ఒక కన్నడ సినిమాకు కాఫి అని సోషల్ మీడియాలో రూమర్స్ వస్తున్నాయి. దీనిపై మూవీ టీం క్లారిటీ ఇచ్చింది .ఇటీవల సిరిసిల్లలో 107(NBK107 ) మూవీ షూటింగ్ ప్రారంభించారు. దానిలో భాగంగా మొదటిరోజు బాలకృష్ణ లుక్ లీకై వైరల్ అయింది. దాంతో అఫిషియల్ గా మూవీ టీం బాలకృష్ణ ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది .

ఈ ఫస్ట్ లుక్ కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్(Sivaraj Kumar ) నటించిన మఫ్టీ సినిమాకి దగ్గర పోలికలు ఉన్నాయి అంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాలకృష్ణ(NBK 107) 107వ సినిమా ఎటువంటి మూవీకి రీమేక్ కాదని, వేరే సినిమాలను కాఫి కొట్టాల్సిన అవసరం లేదని చిత్ర యూనిట్ తెలిపింది. ఇది వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం అని మూవీ యూనిట్ తెలియజేశారు