భారత (India) , శ్రీలంక (Sri Lanka) జట్ల మధ్య  మొహాలీ (Mohali) లోప్రారంభమైన మొదటి టెస్ట్ లో, మూడవ రోజు ఆట లో శ్రీలంక తన తొలి ఇన్నింగ్స్ లో 174 పరుగుల కే కుప్ప కూలింది.  భారత జట్టు తొలి ఇన్నింగ్స్ స్కోరుకు 400 పరుగులు వెనుకబడి ఉంది.

బ్యాటింగ్ లో విజృంభించిన జడేజా బౌలింగ్ లో ను విజృంభించి 5 వికెట్లు తీశాడు. 175 పరుగులు, 5 వికెట్లు ఇంతకన్నా మరపురాని మ్యాచ్ జడేజా కు ఉండదేమో.

శ్రీ లంక బ్యాట్స్ మెన్ లలో నిస్సంక ఒక్కడే చివర కు పోరాడి 61 పరుగులతో అజేయం గా నిలిచాడు

నిస్సంక కు సహకారాన్ని అందించేవారే కరువయ్యారు.  చివరి నలుగురు బ్యాట్స్ మెన్ డక్ అవుట్ అయ్యారు

భారత బౌలర్లలో జడేజా 5 వికెట్లు తీయగా, బుమ్రా, అశ్విన్ చెరో రెండు వికెట్లు తీయగా, షమి ఒక వికెట్ తీశారు.

ఫాలో ఆన్ ఆడుతున్న శ్రీ లంక