Ram Charan’s birthday special updates: రామ్‌చరణ్‌ బర్త్ డే‌కి రెండు సర్‌‌ప్రైజ్ గిఫ్ట్స్.. మెగా ఫ్యాన్స్ కు పూనకాలే!

మరికొన్ని రోజుల్లో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ (Ram Charan) కొత్త లుక్‌లో కనిపించనున్నారు. అందుకోసమే మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మార్చి నెల 27న రామ్‌చరణ్‌ పుట్టినరోజు(Ram Charan’s birthday). ఈ సందర్భంగా మెగా ఫ్యాన్స్ ఆయన కొత్త చిత్రాల అప్‌డేట్స్‌ కోసం ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలోనే ప్రతిఏడాదిలాగే ఈ సంవ‌త్స‌రం కూడా రెండు స్పెషల్ గిఫ్ట్స్ వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సీనియర్ డైరెక్టర్ శంకర్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే(RC15). ఇందులో కియారా అద్వానీ కథానాయిక. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ షెడ్యూల్‌ రాజమండ్రిలో ప్రారంభం అయింది.

ఈ మూవీని 2023 సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ అండ్ టైటిల్ ను రామ్‌చరణ్‌ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా విడుదల చేయనున్నారని సమాచారం. అలాగే ఈసినిమా తర్వాత రామ్‌చరణ్‌ హీరోగా యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి ‘జెర్సీ’ ఫేమ్‌ గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహించనున్నారు. రామ్‌ చరణ్‌ (RC16)వ ప్రాజెక్ట్‌గా ఈ సినిమా సిద్ధం కానుంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన అప్ డేట్ కూడా చెర్రీ పుట్టిన‌రోజున ప్ర‌క‌టించ‌నున్నార‌ని సమాచారం.