దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ మల్టీ స్టారర్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. (RRR) ఈ సినిమాలో కొమురం భీమ్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్‌(Ntr), అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌(Ramcharan) ప్రధాన పాత్రల్లో నటించారు. దాదాపు రూ. 400 కోట్లు భారీ బడ్జెట్‌తో ఈ పాన్‌ ఇండియా సినిమాను డీవీవీ దానయ్య నిర్మించారు. యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మార్చి 25న విడుదలై కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది.

తాజాగా ఈ ఆర్ఆర్ఆర్ మూవీ అమెరికాలో బాహుబలి(Bahubali) రికార్డుల‌ను బ్రేక్ చేసింది. అమెరికాలో ప్రీమియ‌ర్స్‌తో పాటు తొలిరోజు క‌లెక్ష‌న్లు క‌లిపి 5 మిలియ‌న్ డాల‌ర్ల‌ మార్కును దాటి అరుదైన రికార్డు సాధించింది. ఐదేళ్ల క్రితం బాహుబ‌లి మూవీ 4.59 మిలియ‌న్ డాల‌ర్ల క‌లెక్ష‌న్ల‌ను సాధించగా.. తాజాగా ఆర్ఆర్ఆర్ మూవీ ఆ రికార్డును బద్దలు కొట్టింది. అలాగే నైజాంలో 23.35 కోట్ల క‌లెక్ష‌న్ల‌ను రాబట్టి.. పవన్ కళ్యాణ్ ’భీమ్లానాయ‌క్’ మూవీ పేరిట ఉన్న తొలి రోజు క‌లెక్ష‌న్ల‌ రివార్డును కూడా బ్రేక్ చేసింది.