Bheemla Nayak OTT Release: ‘భీమ్లానాయక్’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. ఎప్పుడంటే?

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌( Pawan Kalyan) అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున‍్న “భీమ్లా నాయక్‌”( Bheemla Nayak) సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. ఫిబ్రవరి 25వ తేదీన విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. అయితే తాజాగా “భీమ్లా నాయక్‌” సినిమా ఓటీటీ విడుద‌ల‌కు కూడా సిద్ద‌మ‌వుతున్న‌ట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ప్రముఖ ఓటిటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్(Disney+ Hotstar) సంస్థ ‘భీమ్లానాయక్’ చిత్రం డిజిటల్ రైట్స్ ను భారీ ధరకు కొనుగోలు చేశారు.

తాజా సమాచారం ప్రకారం ‘భీమ్లానాయక్’ సినిమాని మార్చి నెల చివరి వారంలో స్ట్రీమింగ్ చేయబోతున్నారని సమాచారం. కాగా, సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో నిత్యా మీనన్‌ , సంయుక్త మీనన్‌ కథానాయికలుగా నటించారు. మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ తెలుగు రీమేక్‌గా సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ సినిమా కలెక్షన్స్‌ విషయానికొస్తే.. మొత్తంగా చూస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి విడుదలైన 6 రోజుల్లో 68.80 కోట్ల నెట్, 104.70 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.