జగన్ (Jagan) సర్కారుకు పరిస్థితులు ప్రతికూలం గా మారనున్నాయా.!!!  ఒక పక్క జగన్ బాబాయ్ వివేకా (Viveka) హత్య కేసులో అధికార పార్టీ సమాధానం ఇవ్వాల్సి వస్తోంది.  అనుమానం ఎక్కడ వస్తోంది.  బాబాయ్ చనిపోయినప్పుడు జగన్ దంపతులు వెంటనే బయలుదేరి రాకపోవడం అనే ఒక్క విషయం అనుమానాలకు తావిస్తోందా.!!

సినిమా (Cinema) టిక్కెట్ల విషయం లో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే.  ఇప్పటి వరకు జి ఓ విడుదల చేయలేదు.

ఇది ఇలా ఉండగా సరికొత్త గా ఆంధ్ర ప్రదేశ్ హై కోర్ట్ (Andhra Pradesh High Court) తీర్పు కూడా జగన్ సర్కారుకు ప్రతికూలం గానే ఉంది.  మూడు రాజధానుల ప్రతిపాదన, సి ఆర్ డి ఎ (CRDA) చట్టం రద్దు వంటి ప్రతిపాదనలపై రైతులు వేసిన పిటిషన్ల పై ఆంధ్ర ప్రదేశ్ హై కోర్ట్ (Andhra Pradesh High Court( ఇచ్చిన తీర్పు ఏమిటంటే సి ఆర్ డి ఎ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నడుచు కోవాలని తీర్పునిచ్చింది.

ఇందులో మూడు రాజధానుల చట్టాన్ని జగన్ సర్కారు ఇదివరకే రద్దు చేసిన విషయం తెలిసిందే.

తీర్పుకు సంబంధించి కొన్ని అంశాలు

  • రైతులు ఇచ్చిన భూములను రాజధానికి తప్ప తనఖా పెట్టడానికి వీలు లేదు
  • 3 నెలల్లో రైతులకు సకల సౌకర్యాలతో అభివృద్ధి చేసిన ప్లాట్ లను అప్పగించాలి
  • అమరావతి (Amaravathi) నుంచి ఏమి తరలించకూడదు. 
  • అమరావతి (Amaravathi) ని రాజధానిగా డెవలప్ చేయాలి
  • పిటిషనర్ల ఖర్చులు చెల్లించమని కోర్ట్ ఆదేశించింది
  • రాజధాని గురించి అసెంబ్లీ (Assembly) లో చట్టం చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది
  • “రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్” (Master Plan)ప్రకారం నడుచుకోవాలి

ఇది రైతుల విజయంగా అభివర్ణించవచ్చు.  ఇది ఖచ్చితం గా ప్రతిపక్షాలకు ముఖ్యం గా చంద్రబాబు కు బలాన్నిస్తుంది అనడం లో సందేహం లేదు.