ఎంతో అట్టహాసం గా డిస్నీ హాట్ స్టార్ (Hot Star) లో  ప్రారంభమైన బిగ్ బాస్ (Bigg Boss) సరి కొత్త సీజన్ కు ఆది లొనే ఎదురు దెబ్బ.  24 hours live అని ఒక రేంజ్ లో ఊదరగొడుతూ ప్రచారం చేసినా కార్యక్రమ నిర్వాహకులు, చివరకు తుస్సు మనిపించారు. 

హాట్ స్టార్ (Hot Star) కు వీక్షకుల సంఖ్య బాగానే ఉన్న, బయట పెద్ద, పెద్ద హోర్డింగ్ లు, No.1 ఛానల్ స్టార్ మా (Star Maa) లో ప్రచారం, భీమ్లా నాయక్ (Bheemla Nayak) ప్రదర్శించబడుతున్న థియేటర్ ల లో ప్రకటనల ద్వారా మరింత ప్రచారం కల్పించి నా హాట్ స్టార్ లో బిగ్ బాస్ ప్రేక్షకులను అంత ఆకట్టుకోలేదనే చెప్పాలి.

24 hours live అనేది ఒక రకం గా రికార్డు.  OTT లో ఒరిజినల్ కంటెంట్ అప్పుడప్పుడు వస్తాయి.  బిగ్ బాస్ డైలీ ఎపిసోడ్ లు, అందునా 24 Hours లైవ్ ఒక వినూత్న ఆలోచన.  ప్రయోగాత్మకమైన ఈ ఆలోచన కు స్టార్ మా(Star Maa), హాట్ స్టార్ (Hot Star) ని అభినందించాల్సిందే.

అయితే వీక్షకులు అంతగా ఆదరించక పోవడంతో, ఇప్పుడు దీని డైలీ రాత్రి 9 గంటలకు హాట్ స్టార్ లో ప్రసారం చేస్తున్నారు.  అంటే లైవ్ లేదు(deferred live only), 24 గంటల కంటెంట్ లేదు. ఇంత పెద్ద షో ను ప్రచారం చేసి మధ్యలో ఆపలేరు. 

బహుశా పార్టిసిపంట్స్ లో ఎక్కువ మంది పాత స్టార్ మా సీజన్ లో పాల్గొన్న వాళ్ళు, లేదా అంతగా పరిచయం లేని కొత్త ముఖాలు అవడం వల్ల, హాట్ స్టార్ బిగ్ బాస్ (Bigg Boss) సీజన్ నిరాశ పరిచిందనే చెప్పాలి.

ప్రతి సండే నాగార్జున ఎలిమినేషన్ స్పెషల్ ఎపిసోడ్ .  ఈ సండే అనగా 6th మార్చ్ సాయంత్రం 6 గంటలకు ఎలిమినేషన్ స్పెషల్ హాట్ స్టార్ లో.  ప్రోమో (Promo) ను మీరు చూసేయండి.