సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh babu ),కీర్తీసురేష్(Keerthi suresh ) జంటగా నటించిన క్రేజీ సినిమా సర్కారు వారిపాట(Sarkaaru vari paata ).ఈ సినిమా నుండి ఈ మధ్య కళావతి సాంగ్ (Kalavathi song )విడుదల అయ్యి యువతను ఎంతగానో ఆకట్టుకుని, యూట్యూబ్ లో మిలియన్స్ కొద్ది వ్యూస్ సాదించింది. ఇక ఈ సినిమా నుండి రెండో పాట విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

కళావతి సాంగ్(Kalavathi Song ) లీకైనట్టు రెండో సాంగ్ కూడా అలా జరగకుండా చూస్తున్నారు. శివరాత్రి సందర్భంగా సర్కారు వారిపాట(Sarkaaru Vaari Pata ) సినిమాలోని రెండో పాట విడుదల చేయనున్నారు.రెండో పాటను తమన్ ఫుల్ మాస్ బీట్ తో చేసినట్టు తెలుస్తోంది.సర్కారు వారిపాట మే12న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ సినిమాలో మహేష్ స్టైల్ యువతను బాగా ఆకర్షిస్తోంది.