Samantha With Vijay Devarakonda: మరోసారి విజయ్ దేవరకొండతో జోడి కట్టనున్న సమంత!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) ప్రస్తుతం గ్లామర్ రోల్స్తోనే కాకుండా వైవిధ్యభరితమైన కథలు ఎంచుకుంటూ దూసుకెళ్తోంది. ఇటీవల విడుదలైన శాకుంతలం(Shakunthalam) ఫస్ట్ లుక్ విశేషంగా ఆకట్టుకుంటోంది. హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు ప్రొడక్షన్స్, గుణాటీమ్ వర్క్స్ పతాకాలపై దిల్‌రాజు, నీలిమ గుణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే సమంత తాజాగా తెలుగులో మరో మరో సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
యువ కథానాయకుడు విజయ్ దేవరకొండకు(Vijay Devarakonda) జోడిగా మరోసారి నటించనున్నట్లు తెలుస్థోంది. ఇప్పటికే సమతా, విజయ్ దేవరకొండ ఇద్దరూ మహానటి సినిమాలో కలిసి నటించిన సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం శివ నిర్వాణ (Siva Nirvana) డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో సమంత నటించేందుకు అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది .
Recent Comment