భారత (India) , శ్రీలంక (Sri Lanka) జట్ల మధ్య ఈ రోజు మొహాలీ (Mohali) లోప్రారంభమైన మొదటి టెస్ట్ లో, టాస్ గెలిచి భారత జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు ఆరు వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది

ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (Mayank Agarwal), రోహిత్ శర్మ (Rohit Sharma) మొదటి వికెట్ కు 52 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చారు.  అయితే వీరిద్దరు అవుట్ అయ్యాక, హనుమ విహారి (Hanuma Vihari) , విరాట్ కోహ్లీ (Virat Kohli) మూడవ వికెట్ కు 89 పరుగులు జోడించారు.  హనుమ విహారి 58 పరుగులతో రాణించగా, విరాట్ కోహ్లీ 45 పరుగులు చేశాడు.

ఆ తరువాత, రిషబ్ పంత్ (Rishab Panth) ఫోర్లు, సిక్సర్ల తో చెలరేగి పోయాడు.  97 బంతుల్లో 96 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.  మరోసారి సెంచరీ మిస్ చేసుకున్నాడు. శ్రేయాస్ అయ్యర్ (Shreyas Ayyar) 27 పరుగులు చేసి ఔట్ అయ్యాడు

మొదటి రోజు ఆట ముగిసే సమయానికి రవీంద్ర జడేజా (Jadeja) 45 పరుగులతో, అశ్విన్ (Ashwin)10 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.

శ్రీలంక బౌలర్ల లో ఎంబుల్డెనియా రెండు వికెట్లు తీయగా లక్మల్, ఫెర్నాండో, కుమార, డిసిల్వా తలా ఒక వికెట్ తీశారు.