ఆర్ఆర్ఆర్’ టీమ్ తాజాగా దుబాయ్‌లో అడుగుపెట్టింది. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ మల్టీ స్టారర్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఈ సినిమాలో కొమురం భీమ్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్‌(Ntr), అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌(Ramcharan) ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దాదాపు రూ. 400 కోట్లు భారీ బడ్జెట్‌తో ఈ పాన్‌ ఇండియా సినిమాను డీవీవీ దానయ్య నిర్మించారు.

యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మార్చి 25న విడుదల కానుంది. ఈ క్రమంలోనే చిత్రబృందం ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఇందులో భాగంగానే 7 రోజుల్లో 9 నగరాలను చుట్టిరానున్నారు. అయితే తాజాగా ఆర్ఆర్ఆర్ టీం దుబాయ్ లో ల్యాండ్ అయినట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ రోజు సాయంత్రం 4.30 గంటలకు జరగబోయే దుబాయ్ ఎక్స్ పో-2020 ఈవెంట్ లో చిత్రబృందం పాల్గొననుంది. ఈ కార్యక్రమంలో భాగంగా అక్కడి అభిమానులతో రాజమౌళి, చరణ్ , ఎన్టీఆర్ ముచ్చటించబోతున్నారు