పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన తాజా చిత్రంలో రాధేశ్యామ్‌ ఇటీవలే విడుదలై బాక్సఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇక ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాల విషయనికొస్తే.. ఆయన ఆదిపురుష్‌, సలార్‌, స్పిరిట్‌ చిత్రాలతో బిజీగా ఉన్నారు. అలాగే ప్రభాస్‌ దర్శకుడు మారుతీతో కూడా ఓ పాన్‌ ఇండియా మూవీలో నటించనున్నట్లు సమాచారం.

ఇదిలావుంటే.. తాజాగా
ప్ర‌భాస్ తన గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్నార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ స్పెయిన్‌లో ఉండగా అక్కడే ఆయ‌నకి ఈ స‌ర్జ‌రీ జరిగినట్లు సమాచారం. ఇటీవల స‌లార్ మూవీ చిత్రీకరణ సమయంలో ప్రభాస్ గాయ‌ప‌డగా.. ఈ క్రమంలోనే ఆయ‌నకు స్పెయిన్‌లో స‌ర్జ‌రీ జరిగినట్టు తెలుస్తోంది. ఇక ప్రభాస్ కు జరిగిన స‌ర్జరీ సక్సెస్ అవగా.. కొన్ని రోజుల పాటు ఆయన అక్కడే విశ్రాంతి తీసుకోనున్నట్లు సమాచారం.